rajani: ముంబై నేపథ్యంలో మురుగదాస్ మూవీ .. పోలీస్ ఆఫీసర్ గా రజనీ

  • రజనీ తదుపరి సినిమాకి సన్నాహాలు 
  • ముంబై నేపథ్యంలో సాగే కథాకథనాలు 
  • ఈ నెలాఖరులో సెట్స్ పైకి      

'కబాలి' .. 'కాలా' .. 'పేట' సినిమాలను చకచకా ప్రేక్షకుల ముందుకు తెచ్చేసిన రజనీకాంత్, మురుగదాస్ తో సినిమా చేయడానికి రంగంలోకి దిగుతున్నారు. ఈ నెలాఖరులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కథా పరంగా ఈ సినిమా ముంబై నేపథ్యంలో సాగుతుందట.

ఈ సినిమాలో రజనీకాంత్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనీ, ప్రభుత్వ వ్యవస్థలోని లొసుగులను ఆధారంగా చేసుకుని మోసాలకు పాల్పడే కొందరిపై పోరాటం చేసేవాడిగా ఆయన కనిపిస్తాడని అంటున్నారు. ఈ పాత్రను మురుగదాస్ అద్భుతంగా మలిచాడనీ, రజనీ అభిమానుల అంచనాలను అందుకునేలా ఆయన కథాకథనాలను సిద్ధం చేసుకున్నాడని చెబుతున్నారు. గతంలో రజనీ చేసిన 'బాషా' .. 'కాలా' సినిమాలు, మురుగదాస్ చేసిన 'కత్తి' .. 'గజనీ' సినిమాలు ముంబై నేపథ్యంలోనే తెరకెక్కిన విషయం తెలిసిందే.

rajani
murugadoss
  • Loading...

More Telugu News