Telangana: నామినేషన్లు సమర్పించేందుకు ఐదుగురికి మించి రావొద్దు: ఈసీ రజత్ కుమార్

  • అభ్యర్థి ఖర్చు రూ.75 లక్షలకు మించొద్దు
  • ఓటర్లను ప్రభావితం చేసే బ్యానర్లను తొలగిస్తాం
  • ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థి ఖర్చు రూ.75 లక్షలకు మించకూడదని, నామినేషన్లు సమర్పించేందుకు ఐదుగురు మించి రావద్దని ఆదేశించారు. 72 గంటల్లోగా ఓటర్లను ప్రభావితం చేసే బ్యానర్లను తొలగిస్తామని, అధికారిక వెబ్ సైట్లలో రాజకీయ నేతల ఫొటోలు ఉండకూడదని, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

Telangana
lok sabha
elections
april 11th
CEO
  • Loading...

More Telugu News