india: దుమ్ము రేపుతున్న ధావన్, రోహిత్ శర్మ

  • ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడుతున్న రోహిత్, ధావన్
  • అర్ధ శతకాలను పూర్తి చేసుకున్న ఓపెనర్లు
  • భారీ స్కోరు దిశగా టీమిండియా

ఆస్ట్రేలియాతో చండీగఢ్ లో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు దుమ్ము రేపుతున్నారు. 22 ఓవర్లలో 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతకు ముందు టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ను ఆరంభించిన భారత ఓపెనర్లు ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు.

ఈ క్రమంలో ఇద్దరూ అర్ధ శతకాలను సాధించారు. ప్రస్తుతం శిఖర్ ధావన్ 79 పరుగులు (72 బంతులు, 10 ఫోర్లు, 1 సిక్సర్), రోహిత్ శర్మ 51 పరుగుల (62 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్సర్)తో క్రీజులో ఉన్నారు. ఆసీస్ కెప్టెన్ ఫించ్ ఐదుగురు బౌలర్లను మార్చినా ఫలితం దక్కలేదు. ప్రస్తుత జోరు చూస్తుంటే టీమిండియా భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది.

india
Australia
odi
mohali
Rohit Sharma
sikhar dhawan
  • Loading...

More Telugu News