Telangana: మా రిమోట్ కంట్రోల్, భవిష్యత్ తెలంగాణ ప్రజల చేతుల్లోనే ఉన్నాయి!: రాహుల్ గాంధీకి కేటీఆర్ కౌంటర్

  • కేసీఆర్ రిమోట్ మోదీ దగ్గర ఉందన్న రాహుల్
  • రిమోట్ కంట్రోల్ ప్రధానులు, సీఎంలు కాంగ్రెస్ పేటెంట్ అని కేటీఆర్ ఎద్దేవా
  • రాహుల్ వ్యాఖ్యలను దీటుగా తిప్పికొట్టిన టీఆర్ఎస్ నేత

తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రధాని నరేంద్ర మోదీ రిమోట్ తో నియంత్రిస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. రిమోట్ కంట్రోల్ తో ప్రధానులను, ముఖ్యమంత్రులను నియంత్రించడంపై కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ హక్కులు ఉన్న విషయం దేశమంతటికీ తెలుసని ఎద్దేవా చేశారు. తమ రిమోట్, భవిష్యత్ కేవలం తెలంగాణ ప్రజల చేతుల్లోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు.

కేటీఆర్ ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘రాహుల్ గాంధీజీ.. ప్రధాన మంత్రులను, ముఖ్యమంత్రులను రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రించడం కాంగ్రెస్ పార్టీకి ఉన్న పేటెంట్ హక్కు అని దేశమంతటికీ తెలుసు. మీరు, బీజేపీ రాష్ట్రాలపై ఎంతగా పెత్తనం చేయాలని భావించినప్పటికీ, మా భవిష్యత్తు, మా రిమోట్ కేవలం తెలంగాణ ప్రజల చేతుల్లోనే ఉన్నాయి’ అని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News