: రూ. కోటి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించిన నిర్మాత బండ్ల గణేష్


సినీ నిర్మాత బండ్ల గణేష్ ఇల్లు, కార్యాలయాల్లో  సోమవారం నుంచి జరుగుతున్న ఆదాయపన్ను శాఖ దాడులు ముగిశాయి. ఈ దాడుల్లో బండ్ల గణేష్ ఐటీ శాఖకు కోటి రూపాయల అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించారు. అయితే ఆదాయ వివరాలపై సరైన వివరణ ఇవ్వలేకపోయిన గణేష్ మరింత మొత్తం కట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఐటీ శాఖ అధికారులు సూచించారు.

ఆయన ఇల్లు, కార్యాలయాల్లోంచి స్వాధీనం చేసుకున్న దస్తావేజులు, 
లెక్కలు లేని ఆదాయంపై పూర్తిగా పరిశీలన జరిపాలని, అపుడు లెక్కింపు పూర్తవుతుందని అధికారులు తెలిపారు. 'గబ్బర్ సింగ్' విజయానికి గుర్తుగా గణేష్ కు దర్శకుడు పూరి జగన్నాధ్ ఇచ్చిన 43 లక్షల వజ్రా యాష్ ట్రే గురించి అధికారులు వాకబు చేశారు. 

  • Loading...

More Telugu News