India: పాక్ గగనతలం మూసివేత రేపటి వరకు పొడిగింపు

  • భారత వైమానిక దాడి తర్వాత పాక్ నిర్ణయం
  • తొలుత 9న తిరిగి తెరవనున్నట్టు ప్రకటన
  • అంతలోనే మరో ప్రకటన చేసిన సివిల్ ఏవియేషన్

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా గత నెల 26న భారత్ నిర్వహించిన వైమానిక దాడి తర్వాత పాక్ తమ గగన తలాన్ని మూసివేసింది. దీంతో ఆసియా, ఐరోపా ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు వేలాదిమంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుడు మూసేసిన తమ గగన తలాన్ని ఈ  9న తిరిగి తెరవనున్నట్టు ప్రకటించింది. అయితే, అంతలోనే మరో ప్రకటన చేసింది.

సోమవారం (11వ తేదీ) మధ్యాహ్నం మూడు గంటల వరకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్టు పాక్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. అంతర్జాతీయ ట్రాన్సిట్ విమానాలు తమ భూభాగంలో ప్రవేశించకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే, ఉత్తర, దక్షిణ మార్గాల ద్వారా ముందుగా నిర్ణయించిన విమానాలకు మాత్రం అనుమతి ఉన్నట్లు తెలిపింది.

India
Pakistan
Pulwama attack
Pak air space
  • Loading...

More Telugu News