Nampally: చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వెల్లడించిన నీలోఫర్ ఆసుపత్రి

  • 34 మంది చిన్నారులు క్షేమం
  • ఒక చిన్నారికి మాత్రం వెంటిలేటర్‌పై చికిత్స
  • మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉంది

హైదరాబాద్, నాంపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రంలో టీకాలు వేసిన సందర్భంగా సిబ్బంది నిర్లక్ష్యం కారణంతో అనారోగ్యానికి గురైన చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని నీలోఫర్ డాక్టర్లు వెల్లడించారు. 34 మంది చిన్నారులు క్షేమంగా ఉన్నారని నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీకృష్ణ తెలిపారు. ఒక చిన్నారి మాత్రం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోందని.. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని.. వారందరినీ వీలైతే ఈ రోజే డిశ్చార్జ్ చేస్తామని మురళీకృష్ణ తెలిపారు.    

Nampally
Neelofer
Murali Krishna
Ventilator
Doctors
  • Loading...

More Telugu News