Narendra Modi: 'రాఫెల్' దొంగ పత్రాలను తిరిగిచ్చేశాడు!: చిదంబరం ఛలోక్తులు

  • బుధవారం పత్రాలు పోయాయన్నారు
  • శుక్రవారం ఫొటోకాపీలన్నారు
  • కేంద్రం తీరును తప్పుబట్టిన కాంగ్రెస్ సీనియర్ నేత

ప్రస్తుతం కేంద్రంలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర రగడ సృష్టిస్తున్న అంశం రాఫెల్ స్కాం. అనిల్ అంబానీకి లబ్ది చేకూర్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రాఫెల్ విమానాల కొనుగోలులో పక్షపాత ధోరణి చూపించారంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, సుప్రీం కోర్టుకు చేరిన ఈ వ్యవహారంలో కేంద్రం తీరు నవ్వులపాలవుతోంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సెటైర్లు విసిరారు.

"బుధవారం నాడు పత్రాలు పోయాయని అన్నారు, శుక్రవారం నాడు ఫొటో కాపీలని సర్దిచెబుతారు, నాకు అర్థమైంది ఏంటంటే... ఆ దొంగ రాఫెల్ పత్రాలను తిరిగిచ్చేశాడేమో అనిపిస్తోంది" అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా మరో ట్వీట్ లో కూడా ఇదే తరహా అర్థం వచ్చేలా కేంద్రాన్ని ఎద్దేవా చేశారు. "బుధవారం నాడు వార్తాపత్రికల్లో కీలకపత్రాలు బట్టబయలయ్యేసరికి అధికార రహస్యాల చట్టం చూపించారు, శుక్రవారం నాడు మళ్లీ వెనుకంజ వేశారు, మీ సమయస్ఫూర్తికి జోహార్లు" అంటూ విమర్శించారు.

  • Loading...

More Telugu News