Narendra Modi: 'మోదీయే మా డాడీ' అంటున్న అన్నాడీఎంకే నేత!

  • అమ్మ ఉండగా నిర్ణయాలు తీసుకునేవారు
  • అమ్మ పోయాక మోదీ తండ్రిలా వచ్చారు
  • మాకు దిశా నిర్దేశం చేస్తున్నారు

మోదీయే మా డాడీ అంటున్నారు అన్నాడీఎంకే పార్టీ నేతలు. జయలలిత బతికున్నంత వరకూ ‘అమ్మ’ అంటూ ఎంతో ఆప్యాయత చూపిన నేతలు.. ఆమె పోయాక ప్రధాని మోదీ తమకు దిశా నిర్దేశం చేస్తున్నారని, కాబట్టి మోదీయే తమకు తండ్రి అని పేర్కొంటున్నారు. తాజాగా అన్నాడీఎంకే నేత, తమిళనాడు మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ మాట్లాడుతూ... మోదీయే తమ డాడీ అని పేర్కొన్నారు.

విరుతునగర్ జిల్లాలో జరిగిన ఓ పార్టీ కార్యక్రమం తరువాత బాలాజీ మీడియాతో మాట్లాడుతూ.. అమ్మ చనిపోయాక ప్రధాని మోదీ తమకు తండ్రిలా వచ్చారని... ప్రస్తుతానికి మోదీయే తమ డాడీ అని పేర్కొన్నారు. తమకు దిశా నిర్దేశం చేస్తూ మోదీ అండగా నిలుస్తున్నారన్నారు. అమ్మ ఉండగా తానే సొంత నిర్ణయాలు తీసుకునేవారని.. కానీ ఇప్పుడు అమ్మ లేరు కాబట్టి మోదీ తమకు తండ్రి అని పేర్కొన్నారు.

Narendra Modi
KT Rajendra Balaji
Anna DMk
Jayalalitha
Viruth Nagar
  • Loading...

More Telugu News