Andhra Pradesh: కడప జిల్లాలో వైసీపీ-టీడీపీ శ్రేణుల బాహాబాహీ.. సున్నపురాళ్లపల్లిలో తీవ్ర ఉద్రిక్తత!

  • కడపలో నేడు 'కావాలి జగన్-రావాలి జగన్' కార్యక్రమం
  • అడ్డుకున్న మంత్రి ఆది, టీడీపీ శ్రేణులు
  • ఇరువర్గాలను శాంతింపజేసిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో ఈరోజు వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జిల్లాలోని సున్నపురాళ్లపల్లిలో వైసీపీ నేతలు అవినాశ్ రెడ్డి, సుధీర్ రెడ్డి ‘కావాలి జగన్-రావాలి జగన్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఆదినారాయణ రెడ్డి వర్గీయులు, టీడీపీ నేతలు అక్కడకు చేరుకుని వైసీపీ నేతలను అడ్డుకున్నారు.

ఇన్నాళ్లూ పట్టించుకోకుండా తీరా ఎన్నికల ముందు సున్నపురాళ్లపల్లికి ఎందుకు వచ్చారని నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగగా, అదికాస్తా ఘర్షణకు దారితీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను వారించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Andhra Pradesh
Kadapa District
YSRCP
Telugudesam
sunnapurallapalli
Jagan
Chandrababu
adi narayana reddy
  • Loading...

More Telugu News