Andhra Pradesh: వైసీపీలో చేరిన టీడీపీ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి!

  • గల్లా జయదేవ్ గుంటూరుకు గెస్ట్ లాంటివారన్న మోదుగుల
  • ద్వితీయశ్రేణి పౌరుడిగా ఉండలేకే టీడీపీకి రాజీనామా
  • ఎమ్మెల్యే పదవి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రాజకీయ వలసలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా టీడీపీ నేత, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలో చేరారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డితో కలిసి ఈరోజు జగన్ ఇంటికి వెళ్లిన మోదుగుల వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.  ఈ సందర్భంగా మోదుగులకు పార్టీ కండువా కప్పిన జగన్.. ఆయన్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందే తన ఎమ్మెల్యే పదవితో పాటు టీడీపీ సభ్యత్వానికి మోదుగుల రాజీనామా సమర్పించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధినేత జగన్ ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని మోదుగుల తెలిపారు. జగన్ ను సీఎం చేసేందుకు ఓ సైనికుడిలా పనిచేస్తానని వ్యాఖ్యానించారు. టీడీపీ నేత గల్లా జయదేవ్ గుంటూరుకు గెస్ట్ లాంటివారని సెటైర్ వేశారు. జయదేవ్ గుంటూరుకు రావడం, పోవడం తప్పితే ఓ పార్లమెంటు సభ్యుడిగా ఆయన ఎన్నడూ వ్యవహరించలేదని దుయ్యబట్టారు. టీడీపీలో ద్వితీయ శ్రేణి పౌరుడిగా ఉండలేక పార్టీకి రాజీనామా చేశానని వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
YSRCP
Telugudesam
MODUGULA
VENUGOPAL REDDY
Jagan
  • Loading...

More Telugu News