Andhra Pradesh: టీడీపీ కాల్ సెంటర్లలో 3,000 మంది సిబ్బంది ప్రతిపక్షాల ఓట్లను తీసేస్తున్నారు!: విజయసాయిరెడ్డి

  • జయభేరీ, నారాయణ కాలేజీ సిబ్బంది వీరికి అదనం
  • ఈ సమాచారంతో ఏం మ్యానిపులేట్ చేస్తున్నారు?
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి

వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఈరోజు టీడీపీపై మండిపడ్డారు. టీడీపీ కాల్ సెంటర్లలో దాదాపు 3,000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు ప్రతిపక్షాల ఓట్లను తొలగించడంపై పనిచేస్తున్నారని ఆరోపించారు. వీరికి జయభేరి, నారాయణ కాలేజీ సిబ్బంది అదనంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ఈ సమాచారంతో టీడీపీ నేతలు ఏం మ్యానిపులేట్ చేస్తున్నారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘టీడీపీ కాల్ సెంటర్లలో 3,000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు బోగస్ ఓట్లు ఎక్కించడం ప్రతిపక్షాల అనుకూల ఓట్లు తొలగించడం మీద పనిచేస్తున్నారు. మరి జయభేరి, నారాయణ కాలేజీ రోల్స్ లో ఉన్నవారు అదనం. వీళ్ల పనేమిటి?  సేకరించిన సమాచారాన్ని ఏం మానిప్యులేట్ చేస్తున్నట్టు?’అని ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Telugudesam
YSRCP
Vijay Sai Reddy
3000 employees
call centre
  • Loading...

More Telugu News