Nirav Modi: లండన్ వీధుల్లో నీరవ్ మోదీ మారువేషంతో ఇలా... 'ది టెలిగ్రాఫ్' సంచలన కథనం!

  • గడ్డం, మీసాలు పెంచిన నీరవ్ మోదీ
  • బ్రిటన్ లో విలాసవంతమైన జీవితం
  • వజ్రాల వ్యాపారం చేస్తున్న నీరవ్

ఇండియాలో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగ్గొట్టిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బ్రిటన్ కు పారిపోయి, మారు వేషం వేసుకుని వీధుల్లో నిర్భయంగా తిరుగుతున్నాడు. యూకేకు చెందిన ప్రముఖ దినపత్రిక 'ది టెలీగ్రాఫ్' సంచలన కథనాన్ని ప్రచురించింది. ఆయన సుమారు 8 మిలియన్ యూరోల విలువైన భవంతిలో గడుపుతున్నాడని, గడ్డం, జుట్టు పెంచి, దుస్తుల తీరును మార్చుకున్నారని, అయినా ఆయన్ను సులువుగానే గుర్తించవచ్చని తెలిపింది.

ఇక ఆయన్ను గుర్తించిన టెలిగ్రాఫ్ విలేకరి, ఆరోపణలపై ప్రశ్నించగా, 'నో కామెంట్' అంటూ ఆయన నవ్వుతూ వెళ్లిపోయారని రాసుకొచ్చింది. కాగా, నీరవ్ మోదీ పై ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు జారీ అయినా, అతనిపై ఇంకా చట్టపరమైన చర్యలు మాత్రం మొదలు కాలేదని తెలుస్తోంది. లండన్ లో నీరవ్ కొత్తగా వజ్రాల వ్యాపారాన్ని కూడా ప్రారంభించారని టెలిగ్రాఫ్ పేర్కొంది.

Nirav Modi
London
The Telegraf
  • Loading...

More Telugu News