Eelection commission: వచ్చే ఎన్నికల్లో అరాచకమే: మాజీ సీఈసీ కృష్ణమూర్తి

  • రాజకీయ పరిస్థితులు పూర్తిగా దిగజారాయి
  • హింస, ద్వేషం పెచ్చరిల్లే అవకాశం ఉంది
  • సవాళ్లను ఎదుర్కోవడం ఈసీకి అలవాటే

ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను చూస్తుంటే  రానున్న ఎన్నికల్లో పరిస్థితులు మరింత దిగజారేలా కనిపిస్తున్నాయని మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ధన ప్రవాహంతోపాటు హింస, ద్వేషం మరింత పెచ్చరిల్లే అవకాశం కనిపిస్తోందన్నారు.

రాజకీయ నాయకులు, పార్టీలు కొట్టాడుకుంటున్న తీరు చూస్తుంటే తన భావన నిజమవుతుందని అనిపిస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నియమావళిని అమలయ్యేలా చూడడం ఎన్నికల సంఘానికి కత్తిమీద సామేనన్నారు. అయితే ఇటువంటి సవాళ్లను స్వీకరించడం ఈసీకి అలవాటైన పనేనని కృష్ణమూర్తి పేర్కొన్నారు.

Eelection commission
Krishmamurthy
Elections
politics
India
  • Loading...

More Telugu News