Rat: బంగారు చెవి రింగులను ఎత్తుకెళ్లి.. అమ్మవారి ఫోటోకి పెట్టిన ఎలుక!

  • చెవి రింగులను పార్వతీదేవికి సమర్పించింది
  • ఎత్తుకెళ్లిన రోజు శివరాత్రి పర్వదనం
  • సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది

బీహార్‌లో ఎలుకలకు పెద్ద చరిత్రే ఉంది. గతంలో 200 కేన్ల మద్యం తాగాయని చెప్పి అక్కడి పోలీసులు ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. తాజాగా బీహార్‌లోని ఒక బంగారం దుకాణం యజమాని ఓ షాకింగ్ విషయం చెప్పి మరింత ఆశ్చర్యపరిచాడు. పాట్నాలోని నవరతన్ జువెల్లర్స్ అండ్ బ్రదర్స్ షాపు యజమాని అయిన ధీరజ్ కుమార్.. తన దుకాణంలో ఒక ఎలుక ఏం చేసిందో స్వయంగా వివరించాడు. తన దుకాణంలో ఉన్న ఒక ప్లాస్టిక్ సంచి నుంచి బంగారు చెవి రింగులను ఒక ఎలుక దొంగిలించి పార్వతి దేవి ఫోటోకి సమర్పించిందట.

అది మామూలు ఎలుక కాదు సాక్ష్యాత్తు దైవ స్వరూపం అంటున్నాడు. ఎలుక చెవి రింగులను ఎత్తుకెళ్లిన రోజు శివరాత్రి పర్వదినం కావడంతో.. తాను దానిని దైవ స్వరూపంగా భావించడానికి కారణమని తెలిపాడు. ఎలుక సంచిలో ఉన్న చెవి రింగులను ఎత్తుకెళ్లడం సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయిందట. అంతేకాదు.. ఎలుక చెవి రింగులను ఎత్తుకెళ్లేందుకు తన దుకాణాన్నే ఎంచుకున్నందుకు ధీరజ్ తెగ సంబరపడిపోతున్నాడు.

Rat
Bihar
Navaratan Jewellers
Dheeraj kumar
Sivarathri
Godess Parvathi
  • Loading...

More Telugu News