Chandrababu: శ్రీకాకుళం జిల్లాలో బరిలో నిలిచే టీడీపీ అభ్యర్థులు వీరే!

  • అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు
  • కొన్ని నియోజకవర్గాలు మినహా అభ్యర్థుల ఖరారు
  • మిగిలిన నియోజకవర్గాలపై కసరత్తు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ అధినేత అభ్యర్థుల ఖరారుపై కసరత్తు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేస్తూ అసంతృప్తికి తావు లేకుండా వ్యవహరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక కొన్ని నియోజకవర్గాల మినహా దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది.

శ్రీకాకుళం పార్లమెంటుకు.. రామ్మోహన్ నాయుడు, ఇచ్చాపురం.. బెందళం అశోక్, టెక్కలి.. అచ్చెన్నాయుడు, పలాస.. గౌతు శిరీష, నరసన్నపేట.. బొగ్గు రమణమూర్తి, శ్రీకాకుళం.. గుండా లక్ష్మీదేవి, ఆముదాలవలస.. కూన రవికుమార్‌లను చంద్రబాబు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మిగిలిన నియోజకవర్గాలపై కూడా కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం.

Chandrababu
Rammohan Naidu
Achennaidu
Ramana Murthy
Sirisha
Lakshmidevi
  • Loading...

More Telugu News