Hyderabad: వీధి నాటకాల ద్వారా టీడీపీ అరాచకాలను ప్రజలకు తెలియజేస్తాం: హాస్యనటుడు పృథ్వీరాజ్

  • వైసీపీలో చేరిన పలువురు సినీ కళాకారులు
  • వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన సజ్జల
  • బాబు చివరకు ఓట్లను దోచుకుంటున్నారన్న పృథ్వీరాజ్

సినీ కళాకారులు పలువురు వైసీపీలో ఈరోజు చేరారు. వైసీపీ నాయకులు, హాస్యనటులు పృథ్వీరాజ్, కృష్ణుడు సమక్షంలో కమెడియన్ జోగినాయుడు, సినీ కళాకారులు జయశ్రీ, పద్మరేఖ, ఆశ, ప్రిద్విక, మీనాక్షి తేజస్వినిలు ఆ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయం ఉన్న లోటస్ పాండ్ కు వారు వెళ్లారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. అనంతరం, పృథ్వీరాజ్ మాట్లాడుతూ, టీడీపీ, చంద్రబాబుపై విమర్శలు చేశారు. వీధి నాటకాల ద్వారా టీడీపీ అరాచకాలను ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. చంద్రబాబుకు దోచుకోవడానికి ఏమీ లేక చివరకు ఓట్లను దోచుకుంటున్నారని ఆరోపించారు.

Hyderabad
YSRCP
Lotus pond
Jagan
Artists
  • Loading...

More Telugu News