Brahmananda Reddy: వైసీపీలో చేరిన పారిశ్రామికవేత్త బ్రహ్మానందరెడ్డి.. చేరికలో కీలక పాత్ర పోషించిన గంగుల ఫ్యామిలీ!

  • లోటస్‌పాండ్‌లో జగన్‌తో భేటీ
  • అరగంట పాటు చర్చ
  • సీటుపై స్పష్టత వచ్చాకే చేరిక!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జంపింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా నేడు కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పోచ బ్రహ్మానందరెడ్డి వైసీపీలో చేరారు. నేడు వైసీపీ అధినేత జగన్‌తో లోటస్‌పాండ్‌లో భేటీ అయిన బ్రహ్మానందరెడ్డి.. సుమారు అరగంట పాటు చర్చల అనంతరం వైసీపీ కండువా కప్పుకున్నారు. బ్రహ్మానందరెడ్డి చేరిక వెనుక గంగుల కుటుంబం కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. జగన్‌తో భేటీలో తన సీటుపై స్పష్టత తెచ్చుకున్నాకే బ్రహ్మానందరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నట్టు సమాచారం.

Brahmananda Reddy
Kurnool
YSRCP
Jagan
Lotus Pond
  • Loading...

More Telugu News