Telangana: నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీల ఏర్పాటు.. మంత్రి తలసానికి జరిమానా!

  • మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తలసాని
  • ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్ లో తలసాని ఫ్లెక్సీల ఏర్పాటు
  • డీ ఫేస్ మెంట్ యాక్ట్  ప్రకారం ఇది విరుద్ధం

తెలంగాణ పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ, మత్స్యశాఖ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే, మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా నెక్లెస్ రోడ్ మార్గంలో తలసాని అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. డీ ఫేస్ మెంట్ యాక్ట్ కు విరుద్ధంగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని భావించిన జీహెచ్ఎంసీ అధికారులు తలసానికి జరిమానా విధించారు. జరిమానా కింద రూ.25 వేలు చెల్లించాలని నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.

Telangana
minister
talasani
srinivas
flexies
ghmc
fine
necklace road
Hyderabad
  • Loading...

More Telugu News