Medak District: ఎర్రకోట మీద జెండా ఎవరు ఎగరేయాలో నిర్ణయించేది తెలంగాణయే: కేటీఆర్

  • మెదక్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశం
  • ఎన్నికల్లో పోటీ మా అభ్యర్థులు సాధించే మెజార్టీ మధ్యే
  • కేంద్రంలో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజార్టీ సీట్లు రావు

గోల్కొండ కోట మీద ఇప్పటికే గులాబీ జెండా ఎగిరిందని, రేపు ఎర్రకోట మీద జెండా ఎవరు ఎగరేయాలో నిర్ణయించేది తెలంగాణయేనని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మెదక్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ తమ అభ్యర్థులు సాధించే మెజార్టీ మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. కేంద్రంలో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజార్టీ సీట్లు వచ్చే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. 2014లో పూర్తి మెజార్టీతో ప్రజలు మోదీని గెలిపిస్తే ఏం చేశారని విమర్శించారు. ఈ ఐదేళ్లలో మోదీ సర్కారు పాలనలో సామాన్యుడికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు. పెద్దనోట్ల రద్దుతో జనాలను ఇబ్బందులు పెట్టారని అన్నారు. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు మనం గెలిస్తే ఢిల్లీలో శాసించవచ్చని సూచించారు.

Medak District
TRS
krs
paliamentary constituency
modi
bjp
Telangana
KTR
working president
  • Loading...

More Telugu News