yadadri temple: పదకొండు రోజులపాటు యాదాద్రి బ్రహ్మోత్సవాలు

  • నేటి నుంచి శ్రీకారం
  • తొలుత మూడు, తర్వాత ఐదు రోజులపాటు నిర్వహణ
  • తాజాగా మరో ఆరు రోజులపాటు పెంపు

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది పదకొండురోజుల పాటు జరగనున్నాయి. శుక్రవారం ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 18వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. గతంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించే వారు. ఆ తర్వాత ఐదు రోజులకు పెంచారు. ఈ ఏడాది నుంచి పదకొండు రోజుల బ్రహ్మోత్సవాలుగా రూపుదిద్దుకున్నాయి.

ఉత్సవాల్లో భాగంగా ఈనెల 14న ఎదుర్కోలు, 15న స్వామివారి తిరుకల్యాణం, 16న దివ్యవిమాన రథోత్సవం నిర్వహిస్తారు. కల్యాణోత్సవం రోజున ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు స్వామివారిని దర్శించుకోనున్నారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.

yadadri temple
brahmotsavalu
11 days
  • Loading...

More Telugu News