Anitha: పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు టికెట్ ఇవ్వొద్దంటూ టీడీపీ కార్యకర్తల ఆందోళన

  • సమీక్ష సమావేశం రసాభాస
  • స్టిక్కర్లు వేసి మరీ అనితకు వ్యతిరేకంగా ఆందోళన
  • దిక్కుతోచని స్థితిలో టీడీపీ ఎమ్మెల్యే

టీడీపీ పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు వ్యతిరేకంగా ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో  టీడీపీ సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. అనితపై కొన్ని రోజులుగా కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సొంతపార్టీ కార్యకర్తల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో అనిత దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ‘అనిత వద్దు.. టీడీపీ ముద్దు’ అంటూ ఇటీవల విశాఖపట్టణంలో టీడీపీ మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

తాజాగా గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ అనితకు చేదు అనుభవం ఎదురైంది. అధిష్ఠానం సమక్షంలోనే కార్యకర్తలు అనితకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ‘అనిత వద్దు.. టీడీపీ ముద్దు’ అంటూ వాహనాలపై స్టిక్కర్లు వేసి మరీ నిరసన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఆమెకు ఎట్టిపరిస్థితుల్లోనూ టికెట్ కేటాయించవద్దని కార్యకర్తలు అధిష్ఠానాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Anitha
Telugudesam MLA
Payakaraopet
Visakhapatnam District
Telugudesam
Andhra Pradesh
  • Loading...

More Telugu News