Jayasudha: జగన్-నాగార్జున భేటీపై చంద్రబాబు అలా మాట్లాడటం దురదృష్టకరం: జయసుధ

  • వైసీపీలో చేరిన జయసుధ
  • సినీ నటుడిగా కలవలేదు
  • చంద్రబాబు కుటుంబ సభ్యులంతా ఇండస్ట్రీకి చెందినవారే

సినీ నటి జయసుధ నేడు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. గత కొంత కాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆమె నేడు లోటస్ పాండ్‌‌లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జగన్, ప్రముఖ నటుడు నాగార్జున భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నాగార్జున సినీ నటుడిగా వచ్చి కలవలేదని.. సినిమా వాళ్లంటూ తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. జగన్ లాంటి వ్యక్తులను సినీ నటులు కలవడం దురదృష్టకరమని చంద్రబాబు మాట్లాడకూడదన్నారు. ఆయన కుటుంబ సభ్యులంతా సినీ ఇండస్ట్రీకి చెందినవారేనని గుర్తుంచుకోవాలన్నారు.

Jayasudha
Nagarjuna
Jagan
Chandrababu
Telugudesam
Lotus Pond
YSRCP
  • Loading...

More Telugu News