Narasimhulu: ఆటో నుంచి జారిపడి ఇద్దరు చిన్నారుల మృతి

  • సిరిగుంపకు వెళ్లిన నర్సింహులు దంపతులు
  • ఆదోని నుంచి ఎమ్మిగనూరుకు ఆటో ఎక్కారు
  • ఆటో అతి వేగంగా ప్రయాణించడంతో ప్రమాదం

ఆటో నుంచి జారిపడి ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో కందనాతి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని కందనాతి గ్రామానికి చెందిన నర్సింహులు, వీరమ్మ దంపతులు తమ నలుగురు కుమార్తెలతో కలిసి కర్ణాటకలోని సిరిగుంప గ్రామానికి వెళ్లారు.

తమ గ్రామానికి నేడు తిరిగి వచ్చేందుకు సిరిగుంప నుంచి ఆదోనికి బస్సులోనూ.. ఆదోని నుంచి ఎమ్మిగనూరుకు ఆటోలోనూ బయలు దేరారు. ఆటో అతి వేగంగా ప్రయాణిస్తుండటంతో హనుమాపురం అనే గ్రామం మూలమలుపు వద్దకు రాగానే అశ్వని(10), పవిత్ర(1) అనే చిన్నారులు ఆటో నుంచి జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Narasimhulu
veeramma
Kurnool District
Emmiganoor
Karnataka
Adoni
Aswani
Pavitra
  • Loading...

More Telugu News