Chandrababu: సాక్షి విలేఖరి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు.. కూర్చో!: చంద్రబాబు

  • ఏపీ  ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నాయి
  • టీడీపీ స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వం
  • తప్పుడు పనులు చేయటం సరికాదు

టీడీపీ స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వమని.. అనవసరంగా రాజకీయ లబ్ది కోసం తప్పుడు పనులు చేయటం సరికాదని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. నేడు ఆయన ఉండవల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అటు కేంద్రం, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఏపీ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నాయన్నారు.

ఈ సందర్భంగా సాక్షి పత్రిక విలేఖరి ఒక ప్రశ్న వేయగా.. సాక్షి పత్రికకు ఇక్కడ మాట్లాడేందుకు అర్హత లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.. ఆ పత్రికకు చెందిన విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేనేలేదన్నారు. కావాలని ఓ పార్టీ అధ్యక్షుడు పెట్టుకున్న పేపర్.. ఆయన మౌత్ పీస్ నువ్వు.. కూర్చో' అంటూ చంద్రబాబు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu
Sakshi Paper
Undavalli
Telangana
Central Government
  • Loading...

More Telugu News