Hyderabad: వైసీపీలో చేరిన సినీ నటి జయసుధ..పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జగన్

  • వైసీపీలో తాను చేరడం వెనుక ఎవరి ఒత్తిడి లేదు
  • జగన్ ఆదేశాల మేరకు నడుచుకుంటా
  • జగన్ ఆదేశిస్తే రాబోయే ఎన్నికల్లో  పోటీ చేస్తా

మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి జయసుధ వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైఎస్ జగన్ నివాసంలో ఆమె ఈరోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం, మీడియాతో ఆమె మాట్లాడుతూ, వైసీపీలో చేరడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. వైసీపీలో తాను చేరడం వెనుక ఎవరి ఒత్తిడి లేదని చెప్పారు. జగన్ ఆదేశాల మేరకు నడుచుకుంటానని చెప్పిన జయసుధ, వైసీపీలో చేరడం ద్వారా మళ్లీ తన సొంత ఇంటికి వచ్చినట్టు ఉందని అన్నారు. జగన్ ఆదేశిస్తే రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా తాను పోటీ చేస్తానని చెప్పారు.

గతంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు తాను ఎలా ఉండాలి? ఏం చేయాలన్న విషయాలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పిన విషయాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. నాడు సికింద్రాబాద్ సీటు ఇచ్చి తనను వైఎస్ ప్రోత్సహించారని అన్నారు. 2016లో టీడీపీలో తాను చేరినప్పుడు తన విధులేంటో ఎవరూ చెప్పలేదని ఆమె చెప్పారు.

Hyderabad
lotus pond
Jagan
jayasudha
artist
  • Loading...

More Telugu News