YSRCP: మోదుగులకు దమ్ముంటే నాపై ఎంపీగా పోటీ చేసి గెలవాలి: గల్లా జయదేవ్ సవాల్

  • గుంటూరు ఎంపీ సీటుపై మోదుగుల కన్నేశాడు
  • మోదుగుల నన్ను గౌరవించేవాడు కాదు
  • ప్రభుత్వ కార్యక్రమాల్లో నా పేరు ప్రస్తావించేవాడు కాదు

టీడీపీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆ పార్టీని వీడి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుంటూరు ఎంపీ సీటుపై మోదుగుల కన్నేశాడని తెలిసిందని, ఆయనకు దమ్ముంటే తనపై గెలవాలని సవాల్ విసిరారు. మోదుగుల మొదటి నుంచి తనకు గౌరవం ఇచ్చేవాడు కాదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో తన పేరు కూడా ప్రస్తావించేవాడు కాదని జయదేవ్ వ్యాఖ్యానించడం గమనార్హం.  

టీడీపీ డేటా చోరీ విషయమై  తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆయన నిప్పులు చెరిగారు. ఏపీని కేసీఆర్ ఏదో రకంగా ఇబ్బంది పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీని ఓడించాల్సిన సమయం ఆసన్నమైందని, మోదీ పాలసీలు, మాటలు నమ్మి మోసపోయామని అన్నారు. కశ్మీర్ పరిస్థితులను మోదీకి అనుకూలంగా మార్చుకునే యత్నం చేస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే మోదీకి ఓటేసినట్లేనని అన్నారు. జగన్ సీఎం అయితే ఆయన స్విచ్ తెలంగాణలో, ఫ్యూజ్ ఢిల్లీలో ఉంటుందని విమర్శించారు. 

YSRCP
modugula
venugopal reddy
Telugudesam
galla
  • Loading...

More Telugu News