Andhra Pradesh: ఏ తప్పూ చేయకపోతే బట్టలెందుకు చించుకుంటున్నారు?: చంద్రబాబు, లోకేశ్ పై విజయసాయిరెడ్డి ధ్వజం

  • ప్రాథమిక సాక్ష్యాలు లేకుండా దర్యాప్తు మొదలుకాదు
  • ఎవిడెన్స్ దొరికాకే సైబరాబాద్ పోలీసులు విచారణ చేపట్టారు
  • ట్విట్టర్  లో విమర్శలు గుప్పించిన వైసీపీ నేత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐటీ గ్రిడ్స్ కంపెనీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఐటీ గ్రిడ్స్ సర్వర్లలోని టీడీపీ కార్యకర్తల డేటాను తెలంగాణ ప్రభుత్వం వైసీపీకి ఇచ్చిందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

అయితే దీన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి లోకేశ్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ కేసులో సాక్ష్యాలు దొరికాకే తెలంగాణ పోలీసులు విచారణను ప్రారంభించారని ఆయన తెలిపారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ‘ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా పోలీసుల దర్యాప్తు మొదలు కాదు. ఎవిడెన్స్ దొరికిన తర్వాతే సైబరాబాద్ పోలీసులు విచారణ చేపట్టారు. తండ్రీ కొడుకులు ఏ తప్పూ చేయకపోతే బట్టలెందుకు చించుకుంటున్నారు. కోర్టు తలుపు ఎందుకు తట్టారు? డేటా దొంగను ఎందుకు మాయం చేశారు?’ అని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News