Andhra Pradesh: జగన్ తో సమావేశమైన వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్!

  • తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేయాలన్న శివకుమార్
  • పార్టీ నుంచి బహిష్కరించిన అధినేత జగన్
  •  టీడీపీ కుట్రలు చేస్తోందన్న శివకుమార్

వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ ఈరోజు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను కలుసుకున్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు చేరుకున్న శివకుమార్ జగన్ తో కొద్దిసేపు ముచ్చటించారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ కు ఓటేయాలని శివకుమార్ పిలుపునిచ్చారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. దాదాపు 3 నెలల అనంతరం శివకుమార్ జగన్ ను కలుసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలవబోతోందన్న భయంతోనే టీడీపీ కుట్రలకు తెరలేపిందని ఆరోపించారు. కొన్ని కారణాల వల్ల గత 3 నెలలుగా పార్టీకి దూరంగా ఉన్నానని చెప్పారు. జగన్ పెద్ద మనసు చేసుకుని తనను వైసీపీలోకి తిరిగి స్వాగతించారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు సంక్షోభంలో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. తాను జగన్ తో ఈ విషయమై మాట్లాడాననీ, వైసీపీ విజయం కోసం పనిచేస్తానని శివకుమార్ అన్నారు.

Andhra Pradesh
YSRCP
Jagan
sivakumar
meeting
Hyderabad
lotuspond
  • Loading...

More Telugu News