Andhra Pradesh: ‘ఓటుకు నోటు’ కేసులో మరో వీడియో.. బాబును రూ.5 కోట్లకు ఒప్పించానన్న సెబాస్టియన్!

  • స్టీఫెన్ సన్ తో ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చలు
  • మీరు రేవంత్ రెడ్డిని నమ్మారని వ్యాఖ్య
  • తనను బాబు నమ్ముతున్నారని వెల్లడి

నాలుగేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో ‘ఓటుకు నోటు కేసు’ తీవ్ర ప్రకంపనలు రేపింది. ఈ వ్యవహారంలో అప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు నగదు ఇస్తున్న వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. తాజాగా ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్టీఫెన్ సన్ కు సెబాస్టియన్ రూ.5 కోట్లు ఆశచూపుతున్నట్లుగా ఈ వీడియోలో ఉంది.

స్టీఫెన్ సన్: డీల్ ఎంతో చెప్పండి?

సెబాస్టియన్: నిజానికి బాబు రూ.3.5 కోట్లే ఇస్తామన్నారు. కానీ నా ఒత్తిడి మేరకు రూ.5 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డిని మీరు నమ్ముతున్నారు. నన్ను బాబు నమ్ముతున్నారు. మీరు రేవంత్ రెడ్డిని నమ్మడంతో ఆయన తెరపైకి వచ్చారు. ఏది జరిగినా మీరే బాధ్యులు.

స్టీఫెన్ సన్: ఓకే సార్.

అంటూ సాగుతున్న వీడియోను కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేశాయి.

Andhra Pradesh
Telangana
Telugudesam
vote for note
stefenson
sebastinan
  • Loading...

More Telugu News