paritala sunitha: ఎన్నికల సంఘానికి పరిటాల సునీత ఫిర్యాదు

  • నా నియోజకర్గంలో ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నారు
  • 18,159 ఓట్లను తొలగించేందుకు దరఖాస్తులు చేశారు
  • ఓటమి భయంతో వైసీపీ అక్రమ మార్గాలను ఎంచుకుంది

తన నియోజకవర్గం రాప్తాడులో భారీ ఎత్తున ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నారని మంత్రి పరిటాల సునీత అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ద్వివేదిని కలసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, తన నియోజకవర్గంలో మొత్తం 18,159 ఓట్లను తొలగించేందుకు దరఖాస్తులు చేసి ఉన్నాయని చెప్పారు. ఎన్నికల్లో గెలవలేమనే భయంతో వైసీపీ అక్రమ మార్గాలను ఎంచుకుందని... అన్ని విషయాలను ప్రజలు గమనిస్తూ ఉన్నారని తెలిపారు. వైసీపీ ఎన్ని కుట్రలకు పాల్పడినా టీడీపీదే గెలుపని చెప్పారు.

paritala sunitha
Telugudesam
ec
votes
  • Loading...

More Telugu News