Anantapur District: అనంతపురం జిల్లాలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు.. జాబితా ఇదిగో!

  • జేసీ సోదరుల వారసులకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు
  • 6 అసెంబ్లీ, హిందూపురం ఎంపీ స్థానాలు పెండింగ్
  • సర్వేల ఆధారంగా అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు

అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఎనిమిది స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. మరో ఆరు స్థానాలను పెండింగ్ లో పెట్టారు. దీంతోపాటు అనంతపురం ఎంపీ అభ్యర్థిని కూడా ప్రకటించారు. నిన్న రాత్రి 10 గంటల వరకు కసరత్తు చేసి, తన వద్ద ఉన్న సర్వేల ఆధారంగా అభ్యర్థులను ప్రకటించారు. ఈ తొమ్మిది మందిలో జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డిల పేర్లను ఖరారు చేశారు. తమ వారసుల కోసం జేసీ సోదరులు పోటీకి దూరంగా ఉంటామని ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ప్రకటించిన పేర్లలో ఎక్కువ మంది సిట్టింగులే ఉన్నారు.

చంద్రబాబు ప్రకటించిన తొమ్మిది మంది అభ్యర్థులు వీరే:
  • రాప్తాడు - పరిటాల సునీత
  • పెనుకొండ - బీకే పార్థసారథి
  • రాయదుర్గం - కాలవ శ్రీనివాసులు
  • ధర్మవరం - గోనుగుంట్ల సూర్యనారాయణ
  • అనంతపురం - ప్రభాకర్ చౌదరి
  • హిందూపురం - బాలకృష్ణ
  • మడకశిర - ఈరన్న
  • తాడిపత్రి - జేసీ అస్మిత్ రెడ్డి
  • అనంతపురం ఎంపీ అభ్యర్థి - జేసీ పవన్ కుమార్ రెడ్డి.

Anantapur District
Telugudesam
mla
mp
candidates
chandrababu
  • Loading...

More Telugu News