Tamilnadu: 'అమ్మ'ది ముమ్మాటికీ హత్యే... హల్వా పెట్టి చంపేశారని తమిళనాడు మంత్రి సంచలన వ్యాఖ్యలు!

  • జయలలితకు షుగర్ వ్యాధి
  • విషయం తెలుసుకునే స్లో పాయిజన్
  • చివరకు గుండెపోటు వచ్చేలా చేశారు
  • తమిళనాడు న్యాయ మంత్రి సీవీ షణ్ముగం

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం వెనుక మిస్టరీపై విచారణ జరుగుతున్న వేళ, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం ఇంకోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెకు హల్వాను తినిపించి హత్య చేశారని ఆరోపించారు. జయలలితది ముమ్మాటికి హత్యేనని అన్న ఆయన, విచారణ సక్రమంగా జరిగితే, అన్ని వాస్తవాలూ బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు.

జయలలిత మరణంపై ఆర్ముగస్వామి కమిషన్‌ విచారణ జరుపుతున్న వేళ, ఆరోగ్య శాఖ కార్యదర్శిగా ఉన్న రాధాకృష్ణన్‌ ఇచ్చిన వాంగ్మూలం అవాస్తవమని, ఆయన కమిషన్ ముందు అబద్ధాలు చెప్పారని షణ్ముగం విరుచుకుపడ్డారు. చివరి రోజుల్లో జయలలితకు చికిత్స చేసిన అపోలో యాజమాన్యానికి అనుకూలంగా రాధాకృష్ణన్‌ వ్యవహరిస్తున్నారని, కొందరిని రక్షించే ప్రయత్నం ఆయన చేస్తున్నారని అన్నారు.

తాజాగా, విల్లుపురం జిల్లా కళ్లకురిచ్చిలో జరిగిన ఏఐఏడీఎంకే పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న షణ్ముగం, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, జయలలిత ఆసుపత్రిలో కోలుకుంటున్న వేళ, స్లో పాయిజన్‌ గా తీయటి పదార్ధాలను ఇవ్వడం ప్రారంభించారని, ప్రధానంగా హల్వా పెట్టారని ఆయన ఆరోపించారు. ఆమెకు షుగర్ వ్యాధి ఉండటంతో దాన్ని అలుసుగా తీసుకుని షుగర్ పదార్ధాలు పెట్టి, ఆమెకు గుండెపోటు వచ్చే విధంగా పరిస్థితి విషమించేలా చూశారని అన్నారు. షణ్ముగం వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట కాక రేపుతున్నాయి.

Tamilnadu
Jayalalitha
CV Shanmugam
Murder
  • Loading...

More Telugu News