Chittoor District: పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఓటు తీసేసే యత్నం!

  • వైసీపీ ఎమ్మెల్యే ఓటు తీసేయాలని దరఖాస్తు
  • వైసీపీ కార్యకర్త పేరిట దరఖాస్తు
  • విచారిస్తున్న పోలీసులు

తెలుగు రాష్ట్రాలను డేటా వార్, ఓట్ల తొలగింపు వ్యవహారాలు కాక రేపుతున్న వేళ, తన ఓటు గల్లంతైందని చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ మీడియా ముందుకు వచ్చారు. తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యేను అయిన తన ఓటును తీసేయాలని దరఖాస్తు చేయడం, దాన్ని ఎన్నికల అధికారులు పరిశీలించడం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు.

పూతలపట్టు నియోజక వర్గంలోని ఐరాల మండల పరిధిలోని పైపల్లె గ్రామంలో తన ఓటు ఉందని, ఫారమ్–7 దరఖాస్తును ఆన్ లైన్ లో పెట్టి, తన ఓటు తొలగించాలని దరఖాస్తు వచ్చిందని చెప్పారు. అధికారులు దీన్ని పరిశీలించి ఇది వైఎస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్‌ పెట్టినట్టు తేల్చగా, ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను దరఖాస్తు చేయలేదని చెప్పడం గమనార్హం. ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Chittoor District
Putalapattu
Sunil Kumar
Vote
  • Loading...

More Telugu News