Magunta Srinivasula reddy: పవన్ కల్యాణ్ తో భేటీ నిజమే: మాగుంట శ్రీనివాసులరెడ్డి!

  • పవన్ నాకు మంచి మిత్రుడు
  • రాజకీయాలు మాట్లాడలేదు
  • తిరుమలలో మీడియాతో మాగుంట

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయిన మాట వాస్తవమేనని ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వ్యాఖ్యానించారు. తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్న మాగుంట దంపతులు, ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తనకు పవన్‌ కల్యాణ్‌ మంచి మిత్రుడని వ్యాఖ్యానించిన ఆయన, రాజకీయ అంశాలపై మాట్లాడేందుకు నిరాకరించారు. కాగా, ఒంగోలు జిల్లా రాజకీయాల్లో మాగుంట కుటుంబం ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. మరో రెండు మూడు నెలల్లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ, మాగుంట, పవన్ భేటీ కొత్త చర్చకు తెరలేపింది.

Magunta Srinivasula reddy
Pawan Kalyan
Andhra Pradesh
Prakasam District
  • Loading...

More Telugu News