satish reddy: సొంత బాబాయ్ ఓటును కూడా జగన్ తొలగించారు: టీడీపీ నేత సతీష్ రెడ్డి విమర్శ

  • వైయస్ వివేకా ఓటు వేస్తారనే నమ్మకం జగన్ కు లేదు
  • అందుకే ఓటును తొలగించారు
  • జగన్ వ్యాఖ్యలను ఈసీ సుమోటోగా స్వీకరించాలి

వైసీపీ అధినేత జగన్ నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేత సతీష్ రెడ్డి మండిపడ్డారు. భారీ ఎత్తున ఓట్లను తొలగించి రాజకీయంగా లబ్ధి పొందాలని జగన్ యత్నిస్తున్నారని అన్నారు. చివరకు తన సొంత బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి ఓటును కూడా జగన్ తొలగించారని దుయ్యబట్టారు. వివేకా ఓటును తొలగించి, దాన్నుంచి కూడా లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. తన చిన్నాన్న వివేకా తనకు ఓటు వేస్తారనే నమ్మకం జగన్ కు లేదని... అందుకే ఆయన ఓటును తొలగించారని చెప్పారు. ఫారం 7 ద్వారా ఓట్లు తొలగించమని చెప్పడానికి జగన్ ఎవరని ప్రశ్నించారు. జగన్ వ్యాఖ్యలను సుమోటాగా ఎన్నికల సంఘం స్వీకరించాలని డిమాండ్ చేశారు.

satish reddy
Telugudesam
jagan
ys viveka
ysrcp
vote
  • Loading...

More Telugu News