Pakistan: భారతీయ సినిమాలు, టీవీ షోల ప్రసారంపై నిషేధం విధించిన పాకిస్థాన్ సుప్రీంకోర్టు
- గతంలో ప్రసారానికి అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కొట్టివేత
- ప్రభుత్వ విధానాన్ని సవాల్ చేసిన పీఈఎంఆర్‌ఏ
- పిటిషన్ విచారించిన జస్టిస్ గుల్జార్ అహ్మద్ బెంచ్
పాకిస్థాన్ టీవీ చానెళ్లలో భారతీయ సినిమాలు, టీవీ షోల ప్రసారంపై ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం నిషేధం విధించింది. ఈ ఉత్తర్వులతో భారతీయ సినిమాలు, ఇతరత్రా వీడియోలు అక్కడి ప్రైవేటు చానళ్లు, టీవీ షోల్లో ప్రసారం కావు. సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ సర్వోన్నత న్యాయస్థానం ఈ ఉత్తర్వులను జారీచేసింది. పాక్‌లో భారతీయ టీవీ చానెళ్లను అనుమతిస్తూ గతంలో లాహోర్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎంఆర్‌ఏ) ఆ దేశ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ గుల్జార్ అహ్మద్ బెంచ్ ఈ మేరకు తీర్పు వెలువరించింది.