ajay devgan: రాజమౌళి సినిమా కోసం అజయ్ దేవగణ్ .. అలియా భట్ తో బేరసారాలు

- షూటింగు దశలో రాజమౌళి మూవీ
- బిజీగా వున్న అజయ్ దేవగణ్ .. అలియా
- రంగంలోకి దిగిన కార్తికేయ
రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా నటిస్తోన్న ఈ సినిమాలో కథానాయికలు ఎవరనే విషయం ఇంకా తేలలేదు. ఒక కీలకమైన పాత్ర కోసం అజయ్ దేవగణ్ ను .. ఒక హీరోయిన్ గా అలియా భట్ ను తీసుకోనున్నారనే వార్త కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. ఈ ప్రచారంలో నిజం ఉందనేది తాజా సమాచారం.
