Preeti Reddy: ఆస్ట్రేలియా డెంటల్ డాక్టర్ ప్రీతిరెడ్డి ప్రియుడు హర్షవర్ధన్ కూడా మృతి!

  • ప్రీతి హత్య తరువాత వేగంగా వెళుతూ ప్రమాదం
  • పోలీసులు విచారణకు రావాలని ఆదేశించిన తరువాత ప్రమాదం
  • కేసును లోతుగా విచారిస్తున్నామన్న పోలీసులు

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తీవ్ర సంచలనం కలిగించిన డెంటల్ డాక్టర్ ప్రీతిరెడ్డి హత్యకేసు విచారణ మరో మలుపు తిరిగింది. ఆమెను హతమార్చిన మాజీ బాయ్ ఫ్రెండ్ హర్షవర్ధన్ నార్డే, న్యూ ఇంగ్లండ్ హైవేపై తన వాహనంలో వేగంగా దూసుకెళుతూ కారు ప్రమాదానికి గురై మరణించాడు. ప్రీతిరెడ్డి హత్యకు గురైన ప్రాంతానికి 340 కిలోమీటర్ల దూరంలో హర్ష మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆయన మరణించడానికి ముందు ప్రీతిరెడ్డి అదృశ్యంపై విచారించాల్సి వుందని తాము హర్షకు ఫోన్ చేశామని, ఆపై కాసేపటికే అతను మరణించాడని ఎన్ఎస్ డబ్ల్యూ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. హర్ష కారు ఓ ట్రక్ ను ఢీకొని మంటల్లో చిక్కుకుందని, ఈ ప్రమాదంలో అతను సజీవదహనం అయ్యాడని అన్నారు. "వారిద్దరి మధ్యా ఏం జరిగిందన్న విషయంపైనా, ఆమెను చంపిన కారణంపైనా మా వద్ద కచ్చితమైన సమాచారం లేదు. కేసును మరింత లోతుగా విచారిస్తున్నాం" అని డిటెక్టివ్ సూపరింటెండెంట్ గవిన్ డెన్ గాటీ వివరించారు.ప్రమాదం తరువాత దగ్ధమవుతున్న హర్ష కారు

Preeti Reddy
Harshavardhan
Died
Road Accident
  • Loading...

More Telugu News