India: యుద్ధం ఏమంత మంచిది కాదు.. సర్జికల్ స్ట్రయిక్సే బెటర్: ఉడుపి పెజావర మఠాధిపతి

  • యుద్ధం వల్ల ఇరు దేశాలకు అపార నష్టం
  • మెరుపు దాడులను సమర్థిస్తున్నా
  • పాక్‌కు బుద్ధి చెప్పేందుకు అదే కరెక్ట్

భారత్-పాకిస్థాన్ మధ్య ప్రస్తుత పరిస్థితి ఏమంత బాగోలేదు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య క్షీణించిన సంబంధాలు.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రశిబిరాలపై భారత్ దాడులు చేసిన తర్వాత మరింత దిగజారాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధం సంభవించడం ఖాయమన్న వార్తలు కూడా వచ్చాయి. తాజాగా, పాక్ తన సైన్యాన్ని సరిహద్దులకు తరలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇరు దేశాలు యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్టు వస్తున్న వార్తలపై ఉడుపి పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ స్వామీజీ మాట్లాడారు. భారత్-పాక్‌ల మధ్య యుద్ధం ఏమాత్రం మంచిది కాదన్నారు. దీనివల్ల ఇరు దేశాలకు అపారనష్టం తప్పితే ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. భారత్‌పైకి ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాక్‌కు సర్జికల్ స్ట్రయిక్స్ రూపంలో బుద్ధి చెప్పడమే సరైన పరిష్కారమన్నారు. పాక్ భూభాగంలోకి దూసుకెళ్లి అక్కడి ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేయడాన్ని తాను సమర్థిస్తున్నానని స్వామీజీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News