Telangana: ఏపీ డేటా పోయిందని కేటీఆర్ కు కల ఏమైనా వచ్చిందా?: నారా లోకేశ్ సెటైర్లు

  • మా సమాచారం పోలేదు
  • ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది
  • ఈ ఎపిసోడ్ లో పోయింది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ 

ఏపీ డేటా తస్కరించి ప్రజల సమాచారాన్ని దుర్వినియోగం చేశారని ‘ఐటీ గ్రిడ్’ కంపెనీ పై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడంపై ఏపీ ప్రభుత్వం, అధికారులు, టీడీపీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ నేత కేటీఆర్ పై సెటైర్లు విసిరారు.

'కేటీఆర్ గారూ, ఏటీ డేటా పోయిందని కలగన్నారా? తమ సమాచారం పోలేదని, ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. ఓటర్ లిస్ట్ సమాచారం పబ్లిక్ డేటా అన్న విషయం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కూడా స్పష్టం చేశారు. మరి, అలాంటప్పుడు, ఏపీ డేటా పోయిందని కేటీఆర్ కు కల ఏమైనా వచ్చిందా?' అని ప్రశ్నించారు. ఈ ఎపిసోడ్ లో పోయింది ఏపీ డేటా కాదని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అని ఎద్దేవా చేశారు.

‘టైమ్ మిష‌న్ ఎక్కిన కేటీఆర్ గారూ! మార్చ్ 2 న ఎఫ్ఐఆర్ నమోదు అయితే ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 4.30 కి ఐటీ గ్రిడ్స్ సంస్థ పై 30 మంది పోలీసుల దాడి ఎలా జరిగింది? వారం రోజుల పాటు టీడీపీ కీలక సమాచారం ఇవ్వాలని మీరు ఉద్యోగుల‌ను, వారి కుటుంబ సభ్యులను వేధించారు. మా డేటా ఎత్తుకెళ్లిపోయి... ‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే’ అంటున్నారు. సావాస దోషం మ‌రి! ల‌క్షల కోట్ల దొంగ‌తో స్నేహం మిమ్మ‌ల్నీ దొంగని చేసింది’ అని వరుస ట్వీట్లలో కేటీఆర్ ని లోకేశ్ విమర్శించారు.


  • Loading...

More Telugu News