India: భారత జలాంతర్గామిని తరిమికొట్టాం... పాక్ ప్రగల్భాలు!

  • మా జలాల్లో ప్రవేశించకుండా తిప్పికొట్టాం
  • భారత సబ్ మెరైన్ పారిపోయింది!
  • పాకిస్థాన్ నేవీ ప్రకటన

అవాస్తవాలు చెప్పడం పాకిస్థాన్ కు అలవాటే! సొంత సైనికులు వీరమరణం పొందినా ఆ విషయం బయటికి చెప్పకుండా పరువుకోసం దాచిపెట్టడం పాక్ నైజం! ఇక ప్రగల్భాలకైతే లెక్కేలేదు! తాజాగా, భారత్ కు చెందిన జలాంతర్గామి తమ సముద్ర జలాల్లో చొరబాటుకు యత్నించిందని, దాన్ని తరిమికొట్టామని పాక్ నేవీ ప్రకటించుకుంది.

అంతేకాదు, ఇవిగో సాక్ష్యాలు అంటూ ఫుటేజ్ ను కూడా మీడియా ముందుంచింది. దీనిపై పాకిస్థాన్ నావికాదళ ప్రతినిధి మాట్లాడుతూ, పాకిస్థాన్ నేవీ అద్వితీయ నైపుణ్యం కనబరిచి శత్రు జలాంతర్గామిని ప్రాదేశిక జలాల్లో ప్రవేశించకుండా పారదోలింద ని పేర్కొన్నారు.

పాకిస్థాన్ శాంతికాముక దేశం కావడంతో ఆ సబ్ మెరైన్ ను విడిచిపెట్టామని తెలిపారు. ప్రాదేశిక జలాల భద్రత విషయంలో పాకిస్థాన్ నేవీ ఎప్పుడూ వెనుకడుగు వేయబోదని, ఎలాంటి పరిస్థితినైనా పూర్తిస్థాయిలో ఎదుర్కోగల సత్తా ఉందని అన్నారు. 2016 నుంచి భారత జలాంతర్గాములు తమ జలాల్లోకి వచ్చే ప్రయత్నం చేయడం ఇది రెండోసారని పాక్ పేర్కొంది.

సముద్ర మార్గాల ద్వారా పాక్  తన ఉగ్రవాదులను భారత్ లోకి పంపే అవకాశాలున్నాయని ఇండియన్ నేవీ చీఫ్ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే పాక్ భారత జలాంతర్గామిని తరిమికొట్టాం అంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News