Defence minister: అమర జవాన్ల తల్లులకు రక్షణ మంత్రి పాదాభివందనం.. వీడియో వైరల్!

  • డెహ్రాడూన్‌లో ‘శౌర్య సమ్మాన్ సమరోహ్’
  • అమరవీరుల తల్లులను ఘనంగా సత్కరించిన రక్షణ మంత్రి
  • కరతాళ ధ్వనులతో మంత్రికి అభినందన

పుల్వామా ఆత్మాహుతి దాడిలో అమరులైన జవాన్ల తల్లులకు రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ పాదాభివందనం చేశారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో రక్షణ మంత్రి పాల్గొన్నారు.  ‘శౌర్య సమ్మాన్ సమరోహ్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమర జవాన్ల తల్లులను మంత్రి ఘనంగా సన్మానించారు. వారిని శాలువతో సత్కరించిన అనంతరం పాదాలకు నమస్కరించి వారిపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.

పాదాలకు నమస్కరించేందుకు మంత్రి కిందకు వంగుతుండడంతో అవాక్కైన కొందరు తల్లులు వారించినా నిర్మల పట్టించుకోలేదు. అమరవీరుల తల్లులకు మంత్రి ఇస్తున్న గౌరవాన్ని చూసిన అధికారులు, కార్యక్రమానికి హాజరైన వారు కరతాళ ధ్వనులతో మంత్రిని అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  

Defence minister
Uttarakhand
Pulwama attack
Nirmala Sitharaman
touches feet
mothers of martyrs
  • Loading...

More Telugu News