Andhra Pradesh: టీడీపీలోకి భీమిలి మాజీ ఎమ్మెల్యే.. నేడు చంద్రబాబు సమక్షంలో చేరనున్న వైసీపీ మాజీ నేత

  • ఊపందుకుంటున్న వలసలు
  • 2014లో వైసీపీ టికెట్‌పై పోటీ చేసి ఓటమి
  • ఆ తర్వాత పార్టీని వీడిన నేత

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీల్లోకి వలసలు ఊపందుకున్నాయి. వలస నాయకులతో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్‌లు నిండిపోతున్నాయి. తాజాగా, విశాఖపట్టణం జిల్లాలోని భీమిలి మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు. ఇప్పటికే మంత్రి గంటా శ్రీనివాసరావును కలిసి లైన్ క్లియర్ చేరుకున్న ఆయన నేడు పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై పోటీ చేసి ఓటమి పాలైన కర్రి సీతారాం.. ఆ తర్వాత పార్టీని వీడి తటస్థంగా ఉంటున్నారు. రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలకం కావాలన్న ఉద్దేశంతో టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.

Andhra Pradesh
Bheemili
Karri seetharam
Chandrababu
Ganta Srinivasa Rao
  • Loading...

More Telugu News