India: చెవుల్లో లౌడ్ స్పీకర్ల గోల.. కళ్లలో పవర్ ఫుల్ లైట్..! అభినందన్ తో నిజం చెప్పించడానికి పాక్ పెట్టిన చిత్రహింసల తీరిది!

  • 24 గంటలపాటు నిద్రపోనివ్వకుండా టార్చర్
  • అయినా తొణకని వింగ్ కమాండర్
  • నిబ్బరంగా పాక్ అధికారులకు ఎదురొడ్డిన వైనం

భారత వాయుసేన వింగ్ కమాండర్ ను పాకిస్థాన్ సైన్యం ఎన్ని చిత్రహింసలు పెట్టిందో ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ బయటపెట్టింది. ఆ మీడియా సంస్థ కథనం ప్రకారం... అభినందన్ నుంచి దేశ రక్షణ రహస్యాలు రాబట్టేందుకు పాకిస్థాన్ సైనికాధికారులు విపరీతమైన చిత్రహింసలకు గురిచేసినట్టు తెలుస్తోంది. అభినందన్ కూడా భారత్ చేరుకున్న తర్వాత చెప్పిన మాటలే అందుకు నిదర్శనం. పాక్ సైనికాధికారులు తనను శారీరకంగా హింసించలేదు కానీ, మానసికంగా వేధించారంటూ చెప్పడం గమనార్హం.

ఇక ఆ వెబ్ సైట్ కథనం ప్రకారం... "నువ్వు భారత్ లో ఎక్కడుంటావు? ఏ విమానం నడుపుకుంటూ వచ్చావు?" అని ప్రశ్నించగా... ఆ విషయాలను నేను చెప్పకూడదు అంటూ నింపాదిగా సమాధానం ఇచ్చాడు అభినందన్. దాంతో పాక్ మిలిటరీ అధికారుల ఇగో దెబ్బతిన్నదని, దాంతో వాళ్లు మెంటల్ టార్చర్ కు ప్రయత్నించారని సదరు వెబ్ సైట్ పేర్కొంది.

 అభినందన్ ను ఒంటరిగా ఓ గదిలో ఉంచి లౌడ్ స్పీకర్లతో భరించలేనంత వికృతమైన శబ్దాలు చేయడం, కళ్లలో ఎంతో పవర్ ఫుల్ లైట్ వేయడం, దాదాపు 24 గంటల పాటు నిద్ర పోకుండా చికాకు పెట్టడం చేశారట. అంతేకాదు, పాకిస్థాన్ సైనికాధికారులు వరుసగా ఒక్కొక్కరు అభినందన్ ను ఇంటరాగేట్ చేసినట్టు ఆ కథనంలో పేర్కొన్నారు. అయితే అదృష్టం కొద్దీ ఆ కస్టడీ 60 గంటల్లోనే ముగిసి అభినందన్ భారత్ కు వచ్చేయడంతో మరిన్ని చిత్రహింసలు తప్పిపోయాయని, లేకపోతే పాక్ రాక్షసుల చేతిలో ఆ వింగ్ కమాండర్ నరకం చూసేవాడని కథనంలో వివరించారు.

  • Loading...

More Telugu News