Sivaji Raja: 'మా'లో ఎన్నికల సందడి: మెగాస్టార్‌ని కలిసిన నరేష్ ప్యానెల్

  • ‘మా’లో మొదలైన ఎన్నికల వేడి
  • పోటీ పడుతున్న నరేష్, శివాజీరాజా ప్యానెళ్లు
  • నిన్న మహేశ్‌ను కలిసిన నరేష్ ప్యానెల్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా శివాజీ రాజా పదవీ కాలం ముగియడంతో ఈ నెల 10న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ‘మా’ అధ్యక్ష బరిలో శివాజీ రాజాతో పాటు సీనియర్ నటుడు నరేష్ ఉన్నారు. దీంతో ‘మా’లో ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. న‌రేష్‌, శివాజీరాజా ప్యానెళ్లు అధికారం కోసం పోటీప‌డ‌బోతున్నాయి.

ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం ఇప్ప‌టికే ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు మొద‌లుపెట్టేశారు. నరేష్ ప్యానల్‌లో జీవిత, రాజశేఖర్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులున్నారు. నిన్న మద్దతు కోరుతూ సూపర్ స్టార్ మహేశ్ బాబును కలిసిన నరేష్ ప్యానెల్.. నేడు మెగాస్టార్ చిరంజీవిని కలిసింది. వివాదాలకు దూరంగా ఉండాలని చిరు చెప్పినట్టు నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను నరేష్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

Sivaji Raja
MAA
Jeevitha
Rajasekhar
Mahesh Babu
Chiranjeevi
Naresh
  • Loading...

More Telugu News