Andhra Pradesh: గుంటూరులో అల్లరిమూక స్వైరవిహారం.. ఎన్టీఆర్ విగ్రహాలే లక్ష్యంగా దాడులు!

  • పలుచోట్ల ఎన్టీఆర్ విగ్రహాలకు నిప్పు
  • నెహ్రూనగర్ లో విగ్రహం తల ధ్వంసం
  • ఆందోళనకు దిగిన టీడీపీ శ్రేణులు

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో గుర్తుతెలియని దుండగులు రెచ్చిపోయారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహాలకు నిప్పుపెట్టడంతో పాటు ధ్వంసం చేశారు. దీంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిన్న రాత్రి ఎవ్వరూ లేని సమయంలో కొందరు దుండగులు స్తంభాలగరువు, నెహ్రూ నగర్, ఏటుకూరు రోడ్డు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాలకు నిప్పు పెట్టారు. పెట్రోల్ లో ముంచిన వస్త్రాలను విగ్రహంపై వేసి మంట పెట్టారు.

అలాగే నెహ్రూనగర్ లో ఎన్టీఆర్ విగ్రహం తలను ఆకతాయిలు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ నేతలను సముదాయించారు. బాధ్యులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనను విరమించిన టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదును అందజేశారు.

Andhra Pradesh
Guntur District
Telugudesam
ntr statues
destroyed
torched
  • Loading...

More Telugu News