Siddipet District: సిద్ధిపేటలో బావిలో పడ్డ కారు... వైజాగ్ వాసులకు తీవ్ర గాయాలు!

  • ఈ తెల్లవారుజామున ఘటన
  • అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు
  • గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు

సిద్ధిపేట సమీపంలో అదుపుతప్పిన ఓ కారు రోడ్డు పక్కన ఉన్న బావిలో పడిపోగా, విశాఖపట్నం ప్రాంతానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన నేటి తెల్లవారుజాము సమీపంలో జరిగింది. సిద్దిపేట రూరల్ మండలం గుర్రాలగొంది గ్రామ శివారు ప్రాంతంలో ఘటన జరుగగా, గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

విశాఖ జిల్లాకు చెందిన కొందరు ఓ శుభకార్యం నిమిత్తం సిద్దిపేటకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. తాను వేగంగా నడుపుతున్న కారును డ్రైవర్ నియంత్రించలేక పోయాడని, దీంతో రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో అది పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.

Siddipet District
Well
Road Accident
Vizag
car
  • Loading...

More Telugu News