Nara Lokesh: జగన్ ఓ దొంగబ్బాయ్... బహుమతంటూ దొంగతనం చేసిన కేసీఆర్: లోకేశ్

  • హైదరాబాద్ ఐటీ బ్రాండ్ పరువు తీశారు
  • రిటర్న్ గిఫ్ట్ అంటే ఏపీలో ప్రచారం అనుకున్నా
  • ట్విట్టర్ లో నారా లోకేశ్ విసుర్లు

తమకు సంబంధించిన డేటాను దొంగిలించడం ద్వారా ఐటీ ప్రపంచంలో హైదరాబాద్ కు ఉన్న బ్రాండ్ పరువును తీశారని తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ ట్వీట్ ను పెట్టిన ఆయన, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌ ను దొంగబ్బాయని అన్నారు. కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్‌ ను గుర్తు చేస్తూ, ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేయడం రిటర్న్ గిఫ్ట్ అనుకున్నామని, కానీ, హైదరాబాద్‌ లో ఉన్న తమ డేటాను దొంగిలించారని ఎద్దేవా చేశారు.

"హైకోర్ట్ సాక్షిగా దొర గారి దొంగతనం బయటపడింది. తెల్లకాగితాలపై విఆర్ఓ సంతకాలతో అడ్డంగా దొరికిపోయారు. ప్రజాక్షేత్రంలో చంద్రబాబు గారిని ఎదుర్కొనే దమ్ములేక ఐటీ కంపెనీలపై దాడి చేసి, ఉద్యోగస్తులను అక్రమంగా అరెస్ట్ చేసారు అని తేలిపోయింది" అని ఓ ట్వీట్ లో, "రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటే ధైర్యంగా వచ్చి దొంగ అబ్బాయి తరపున ప్రచారం చేస్తారు అనుకున్నా, కానీ మీరు డేటా దొంగలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్ ని దెబ్బతీసారు" అని మరో ట్వీట్ లో వ్యాఖ్యానించారు.





  • Loading...

More Telugu News