Governor: గవర్నర్, కేసీఆర్, జగన్ శివరాత్రి శుభాకాంక్షలు

  • ప్రజల్లో ఐకమత్యాన్ని పెంచుతుంది: గవర్నర్
  • రాష్ట్రాన్ని ఐశ్వర్యంతో తులతూగేలా చేయాలి: కేసీఆర్
  • ప్రజలందరికీ శుభం జరగాలి: జగన్

తెలుగు ప్రజలకు గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వేర్వేరుగా మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.  ప్రజల్లో ఐకమత్యాన్ని, సోదరభావాన్ని మహాశివరాత్రి పెంపొందిస్తుందని గవర్నర్ పేర్కొనగా.. ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యంతో తులతూగేలా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను దీవించాలని శివుడిని వేడుకుంటున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. 11 మాస శివరాత్రుల్లో ఎంతో ఔన్నత్యం కలిగిన మహాశివరాత్రిని ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో, పరమ పవిత్రంగా జరుపుకుంటారని పేర్కొన్న జగన్, ఈ పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభం జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.  

Governor
ESL Narasimhan
KCR
Jagan
Maha shivratri
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News